Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలోని అల్వాల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి బతికుండగానే అతన్ని చంపేశారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. గణేశ్ అని వ్యక్తి చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదే సమయంలో బాధితుడు ఇంట్లో లేకపోవడంతో ఈ వార్త నిజమేనని నమ్మి.. గణేశ్ భార్య షాక్కు గురైంది. అక్కడికక్కడే కుప్పకూలడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.