కాచిగూడ,జూన్ 9: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో నగర రూపురేఖలు మారనున్నాయని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 7వ రోజు గురువారం కాచిగూడ డివిజన్లోని మౌలానా ఆజాద్‌నగర్ తదితర బస్తీ కాలనీలలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొని డివిజన్లోని రోడ్డుకు ఇరువైపు ప్రాంతాల రోడ్లపై ఉన్న చెత్త చెదారం, మట్టి కుప్పలను సిబ్బందితో తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. గత పాలకులు డ్రైనేజీ పైపులైన్లను నేటి జనాభా అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించకపోవడంతో డ్రైనేజీ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు.
పలు డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి త్వరలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, ప్రజా ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మౌలానాఆజాద్నగర్ బస్తీలో పాదయాత్ర చేసి కాలనీవాసుల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన సమస్యగా మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్‌యాదవ్, సునీల్బిడ్లాన్, డివిజన్ ఇన్చార్జి డాక్టర్ శిరీషాయాదవ్, ప్రధానకార్యదర్శి సదానంద్, బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, డీఎంసీ వేణుగోపాల్, ఈఈ శంకర్, డీఈ సువర్ణ, జలమండలి ఏఈ భావన, సుభాశ్పటేల్, బి.కృష్టాగౌడ్, శ్రీకాంత్‌యాదవ్, నర్సింహారెడ్డి, భీంరాజ్, వాసు, ఆర్.సంతోశ్, రవియాదవ్, నాగు, సురేశ్, నర్సింగ్‌రావు, పట్లూరి సతీశ్, బబ్లూ, అంటోని, అశోక్కులకర్ణి, బల్వీర్, రాము, భీంరాజ్, వాసు, ఆర్.సంతోశ్, రవియాదవ్, నాగు పాల్గొన్నారు.
అంబర్‌పేట, జూన్ 9: అంబర్‌పేట నియోజకవర్గంలో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలో ఆయా డివిజన్ల నోడల్ అధికార్ల నేతృత్వంలో ఇది సాగుతున్నది. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొని బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో 1969 ఉద్యమకారుడు ఉప్పు సుధాకర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, రమేశ్ నాయక్, బొట్టు శ్రీను, బంగారు శ్రీను పాల్గొన్నారు.
గోల్నాక, జూన్ 9: స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నామని కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గురువారం అంబర్‌పేట డివిజన్ న్యూపటేల్నగర్, పటేల్‌నగర్ తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రగతిలో భాగంగా ఏడోరోజు నిర్వహించిన కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్ధ్ముదిరాజ్ పాల్గొన్నారు.