సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): ‘దీపాంజలి స్కూల్ ఫర్ ఎక్స్లెన్స్ ఆఫ్ కూచిపూడి’ ఆధ్వర్యంలో నృత్యకారిణి సిద్ధి కామాక్షి పిమిడి ఘంటం నృత్య ప్రదర్శన శుక్రవారం రవీంద్రభారతి వేదికగా అలరించనున్నది. గణేశ పంచరత్నం, గౌరీ సుకుమారి, వీక్షే కదా దేవదేవం, స్మర సుందరాంగుని, తిల్లాన, మంగళం రామచంద్రాయ తదితర నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. ఈ ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సలాక రఘునాథ శర్మ, ఎస్ఎన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాజీ నృత్య విభాగాధిపతి ప్రొఫెసర్ అరుణ భిక్షులు హాజరుకానున్నారు.