ఖైరతాబాద్, జూన్ 9 : ప్రజల సంప్రదాయం, మనోభావాలు దెబ్బతినకుండా గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గణేశ్ ఉత్సవాలు జరుగుతాయన్నారు.
ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి గణశ్ ఉత్సవాలపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సారి కూడా ప్రతిమలను సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడి మల్, ప్రధాన కార్యదర్శి శశిధర్, కార్యదర్శులు బుచ్చిరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.