ఉప్పల్, చర్లపల్లి, కాప్రా, జూన్ 9 : పట్టణ ప్రగతితో కాలనీల అభివృద్ధికి కృషిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నాచా రం, చర్లపల్లి, చిలుకానగర్, మల్లాపూర్ ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. నాచారంలోని ఇందిరానగర్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలలో సమస్యలు లేకుండా చూడాలని, అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ పనులు పూర్తిచేయకపోకవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలలో రోడ్డు, పారిశుధ్య సమస్యలు లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ శంకర్, నాచారం సీఐ కిరణ్‌కుమార్, ఏఎంసీ సురేందర్, జలమండలి జీఎం జాన్షరీఫ్, డీజీ ఎం సతీశ్, గ్రేటర్ టీఆర్ఎస్పార్టీ నాయకులు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, అంజి, విఠల్, రాంచందర్, రామకృష్ణ, రెబల్ రాజు, ప్రతీరెడ్డి, సువర్ణ సుగుణాకర్‌రావు, బుచ్చన్న పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్లో… చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో డిప్యూటీ కమిషనర్ శంకర్, నోడల్ అధికారిణి ఉషా, ఏఎంఓహెచ్ అధికారిణి డాక్టర్ స్వప్నారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సంతోష్‌రెడ్డి, సెక్టార్ ఎస్సై ఉపేందర్‌యాదవ్, ఎంటమాలజీ అధికారి రమేశ్, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, విద్యుత్ అధికారి పృథ్వీరాజు, జలమండలి డీజీఎం సతీశ్, ఏఈ రోహన్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, రెడ్డినాయక్, వినోద్, ఉపేందర్, మంద చంద్రమౌళి, వెంకటేశ్, ఎస్కే. కరీం, సత్యనారాయణ, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు గంప కృష్ణ, శ్రీనివాస్, ఈశ్వరయ్య, కృష్ణ, చెన్నారెడ్డి, శ్యామ్, రాకేశ్, మనోహర్, కిష్టమ్మ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మల్లాపూర్ డివిజన్ రూపురేఖలు మారాయని ఆ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలలోని వివేకానందనగర్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన పాదయాత్ర చేశారు. స్థానిక సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. కాలనీలో పారిశుధ్య కార్యక్రమాలపై స్థానికులకు అవగాహన కలిగిస్తూ, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని కోరారు. డీఈఈ రూప, ఏఈఈ స్రవంతి, కాలనీ అధ్యక్షులు నెమలి రవికుమార్, వీరస్వామి, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, రాజ్‌కుమార్, యాదగిరి, వెంకట్, నాగరాజు, కృష్ణ, రత్నమాల, కీర్తి శ్రీకాంత్, రాపోలు శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.
చిలుకానగర్‌లో… పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లోని ఈస్ట్ కల్యాణపురి, బాలాజీ ఎన్క్లేవ్, టీచర్స్‌కాలనీ, రాఘవేంద్రకాలనీలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పర్యటించారు. కాలనీలలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతితో కాలనీలలో సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యలను గుర్తిస్తూ, కాలనీవాసుల ఇబ్బందులు తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు బన్నాల ప్రవీణ్, వీబీ. నర్సింహా, ఏదుల కొండల్‌రెడ్డి, రాంరెడ్డి, కొకొండ జగన్, బింగి శ్రీనివాస్, రామానుజన్, నారాయణరెడ్డి, అల్లిబిల్లి మహేందర్ పాల్గొన్నారు.