దుండిగల్, జూలై 3: మద్యం తాగొద్దన్నందుకు కట్టుకున్న భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఉదంతం బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం, కొత్తసొలస గ్రామానికి చెందిన కిలారు బాలక్రిష్ణ అదే మండలంలోని సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన భార్గవి(35)తో 2014లో పెద్దల సమక్షంలో వివాహ మైంది. వివాహానంతరం దంపతులు నగరానికి వచ్చి, నిజాంపేట్ సర్కిల్ పరిధి, బాచుపల్లి, రాజీవ్ గాంధీనగర్ ఎదురుగా ఉన్న జయదీపిక ఎస్టేట్‌లోని 102 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు.
వీరికి ఒక కూతరు, కొడుకు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే బాలక్రిష్ణ గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు, మీరు మద్యం తాగొద్దని భార్గవి తన భర్తను మందలించడంతో కోపం పెంచుకు న్నాడు. జూన్ 20న మద్యం మత్తులో ఇంటికి వ చ్చిన బాలక్రిష్ణ తన భార్యను దూషిస్తూ ఈ రోజు మధ్యాహ్నం నీవు ఉరేసుకుని చస్తున్నావంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి ఇం టికి చేరుకున్న బాలక్రిష్ణ తన భార్యను గొంతునులిమి హత్యచేసి ఏమీ ఎరగనట్లు డైనింగ్ హాల్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసి భార్గవి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.