Hyderabad | హైదరాబాద్ : వనస్థలిపురంలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్య.. ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే ప్రయత్నం చేసింది. 8 సంవత్సరాల క్రితం శిరీషను కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురం గ్రామానికి చెందిన కిషన్ నాయక్‌కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
గొడవల నేపథ్యంలో భర్త కిషన్ నాయక్‌ను వదిలి వనస్థలిపురం హిల్స్ కాలనీలో శిరీష్ ఒంటరిగా ఉంటుంది. పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది భార్య శిరీష. కిషన్ నాయక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది. శిరీషతో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.