హైదరాబాద్ : అనుమానం పెనుభూతమైంది. కలకాలం భార్యతో కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా మనువాడిన వాడే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాహు, మధుమిత దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషింకుటున్నారు.
ఈ క్రమంలో భార్య మధుమితపై అనుమానం పెంచుకున్న సాహు బండరాయితో ఆమె తలపై మోదీ హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.