రైలు కిందపడి భార్యాభర్తల ఆత్మహత్య
రైలు కిందపడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ రైల్వే పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మారేడ్‌పల్లి, జూలై 3: రైలు కిందపడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ రైల్వే పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగే రవికుమా ర్ (42), భార్యా శీరిష (32) దంపతులు. జీవనోపాధి కోసం పెద్ద అంబర్‌పేట్‌లోని అశోక్‌నగర్, కుంట్లూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు 6వ, 9వ తరగతి చదువుతున్నారు. రవికుమార్ బి య్యం వ్యాపారం నిర్వహిస్తుండగా, శిరీష గృహిణిగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ ఆస్తి తగాదాలో మరే ఇతర కారణాలో తెలియదు గాని.. ఈ నెల 2వ తేదీన గురువారం రాత్రి 7:30 గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన దంపతులు బీబీనగర్- ఘటుకేసర్ రైల్వే స్టేషన్ల మధ్య వాహనాన్ని పార్కు చేసి, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
కృష్ణ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ పట్టాలపై ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి జేబులో ద్విచక్రవాహనం తాళాలు, సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Husband and Wife
- Suicide
- Train
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

