హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అక్రమార్కులు మరో అడుగు ముందుకు వేసి గంజాయి, పూలు, ఫలాల నుంచి తయారుచేసిన అతి విలువైన వీడ్ అయిల్ను(Weed oil) సరఫరాకు తెరలేపారు. తాజాగా గంజాయి అయిల్ను(Ganja oil) అరకు నుంచి హైదారాబాద్‌కు తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు గురువారం తెల్లవారు జామున నిర్వహించిన దాడిలో రూ. 8 లక్షల విలువ చేసే గంజాయి అయిల్ను నాంపల్లిలో పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన జయచందర్, నిజాంపేట్‌కు చెందిన మంగపేట రాజేష్ కుమార్, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన కట్ట చింటును అరెస్టు చేశారు. కాగా, చాకచక్యంగా గంజాయి అయిల్ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలహాసన్‌రెడ్డి అభినందించారు.