Ganja oil | నిన్న మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అక్రమార్కులు మరో అడుగు ముందుకు వేసి గంజాయి, పూలు, ఫలాల నుంచి తయారుచేసిన అతి విలువైన వీడ్ అయిల్ను(Weed oil) సరఫరాకు తెరలేపారు.
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్‌నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.