మేడ్చల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతున్నారు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలైన స్వప్న, నరేశ్, శ్రవణ్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, స్వామిలతో పాటు 30 మంది కార్యకర్తలు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధు, నరేశ్‌లతో పాటు 25 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెనకాడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో చెప్పుకుంటున్నట్లు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతాం
మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు, మహిళలు మండిపడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్
గెలుపు తధ్యం.