ఆరు గ్యారెంటీలకు భారీగా దరఖాస్తులు
అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది.
- అభయహస్తం దరఖాస్తులు 56 వేలు
- ఇతర దరఖాస్తులు 18, 528
- నేటి నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ
బేగంపేట్, జనవరి 7: అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది. ఆయా పథకాలను పొందేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో మొత్తం 24 సెంటర్లను ఏర్పాటు చేసి 96 కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈక్రమంలో నియోజకవర్గం మొత్తంగా అభయహస్తం ద్వారా 56 వేల 3 దరఖాస్తులు రాగా, ఇతర వాటికి 18, 528 దరఖాస్తులు వచ్చినట్లు బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను సోమవారం నుంచి ఆన్లైన్లో నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వారు తెలిపారు. ప్రధానంగా సనత్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణగౌడ్, ఆకుల రూపలు దరఖాస్తులు నింపడంలో దగ్గరుండి చూసుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ నుంచి అధికంగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా, అత్యల్పంగా అమీర్‌పేట్ డివిజన్ నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

