RS Praveen Kumar | బండి సాయి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారని డీజీపీని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ బండి సాయి భగీరథ్ మేనమామకు ఒక నోటీసు పంపించారు. ఓ అమ్మాయి తల్లి కంప్లెయింట్ మీద కేసు బుక్ చేయబడ్డది. ఆ కేసు మీద సెక్షన్లు మార్పు చేయబడ్డాయి. 11, 12 సెక్షన్లు కాకుండా 5,6 అనే సెక్షన్లు పెట్టాం. అందుకోసం మీరు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల బండి సాయి భగీరథ్‌ను మా పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు అతని మేనమామకు నోటీసులు ఇచ్చారన్నారు.
గౌరవ డీజీపీని అడుగుతున్నా. ఓ మైనర్ అత్యంత క్రూరమైన రీతిలో ఉచ్చులో వేసుకుని ఆమె మీద చేయరాని నేరాలు, అత్యాచారాలన్నీ చేసి 5 రోజులుగా పరారీలో ఉన్న వ్యక్తి తండ్రిని వదిలేసి మేనమామకు నోటీసులు ఇచ్చిర్రు. ఎందుకో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
బండి సంజయ్ నిన్న సాయంత్రం 6 గంటలకు వేలాదిమంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చారు. ఎవరైతే నాతో పెట్టుకుంటారో వాళ్ల అంతు చూస్తానని చెప్పి బెదిరించారు. మీరు ఆ బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వకుండా మీరు బండిసాయి భగీరథ్ మేనమామకు నోటీసులు ఇచ్చిర్రు. పోక్సో కేసులో ఓ అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడికి నోటీసులు ఏ చట్టంలో రాసుందో చెప్పాలని డీజీపీతోపాటు తెలంగాణ పోలీస్ఉన్నతాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.
బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు?
అయన తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్లో ఒక యాత్రలో పాల్గొన్నాడు అతనికి ఎందుకు ఇవ్వలేదు?
POCSO కేసులో 5 రోజుల పరారీలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులు మేనమామకు ఎందుకు ఇచ్చారు
మేనమామకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో… https://t.co/cTqNialReD pic.twitter.com/8563pnkODK
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2026
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు