MLA Anirudh Reddy | ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరూ ట్రోల్స్ చేస్తరు. సినిమా యాక్టర్లు వాళ్లు గ్లాసులు పట్టుకుంటే హీరోలు.. మరి రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేం జీరోనా..? మేం తాగమని చెప్తున్నమా.. మీరే కదా సినిమాలల్లా డ్రింక్స్ పట్టుకొని తాగుతరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
మీడియా సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ఖుషీ సినిమా చూసిన. దాంట్లో అలీ, పవన్ కల్యాణ్ ఉంటరు. అలీ ఇంతింత ప్యాకెట్లు పెట్టుకుని తెలంగాణలోని ధూల్ పేట్ నుంచి తెచ్చిన అని చెప్పి ధూల్ పేటోళ్లని చిన్నచూపు చూపిచ్చినరు. అక్కడ ప్యాకెట్లు దొరికినయని చూపించినరు. పవన్ కల్యాణ్ తాగుకుంట తొక్కు నాకుతడు. మళ్ల ఇదేం కల్చర్. నేను పవన్ కల్యాణ్ గురించి నెగెటివ్ చెప్తలేను. సినిమాను సినిమాలాగా చూడాలే. కానీ యూత్ ఏం చూస్తరు. మా యాక్టర్ గుడుంబా తాగుతడు. అదెక్కడ దొరుకుతది ధూల్ పేట్ పోతమంటరు. అదైతే కరెక్ట్.. ఒకవేళ రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం.. నేనేం తాగమని చెప్తలేను. ఇప్పటికీ చెప్తున్నా తాగొద్దంటున్నాను. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వాపోయారు.
బాలకృష్ణ మామ ఏక్ పెగ్ లా అంటే పబ్బుల్లో మూడు పెగ్గులు తాగుతరు. మరి అది సెన్సార్‌బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా.. అసలు సినిమాలల్లా డ్రింక్స్ తాగేదే చూపియొద్దు. మందుబాబులం అంటే యువకులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్లు తాగుతేనేమో కరెక్ట్ మేం మా జీవితమంతా మా పిల్లలతో కూడా గడపలేం. వాళ్లు సినిమాలు తీస్తే వాళ్లకు రెవెన్యూ వస్తది. మేం జనాల్లోకి పోయి మా పిల్లల పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
బాలకృష్ణ మామ ఏక్ పెగ్ లా అంటే, పవన్ కళ్యాణ్ మందుబాబులం అంటే యువకులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు
సినిమాల్లో మందు తాగే సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు కట్ చేయాలి – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి pic.twitter.com/zqA9Aus3Ca
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా
సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు.. రాజకీయ నాయకులు గ్లాసులు పట్టుకుంటే జీరోలా? – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి https://t.co/WUbbcTl9bq pic.twitter.com/LI0FstsKN5
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్‌కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్