ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో రెండు ప్యానల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. సొసైటీలో మొత్తం 1352 మంది సభ్యులు ఉండగా, 429 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 10 ఓట్లు చెల్లలేదు. మొత్తం తొమ్మిది డైరెక్టర్ పోస్టులకు గాను శంకరయ్య ప్యానెల్ నుంచి ఐదుగురు, రాజేశ్వరరావు ప్యానల్ నుంచి నలుగురు గెలుపొందారు.
కే భీమయ్య 280, జే రాజేశ్వరరావు 263, జి శంకరయ్య 234, వి రాజేశ్వర్ 229, ఎం శంకర్ 226, బి వెంకటేష్ 225, కే శంకర్ నాయక్ 205, జంగయ్య 203, సాయి ప్రసాద్ 200 ఓట్లు సాధించి గెలుపు బాగుట ఎగరవేశారు. గెలుపొందిన 9 మంది కలిసి ఈ నెల 2వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.