Hyderabad | ఓయో రూమ్‌లో బుక్స్ చేసుకునే వారికి అలర్ట్! ఇకపై హోటల్లో మీరు బుక్ చేసుకున్న రూమ్‌లోకి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు గదిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లేదంటే అనవసరంగా లేనిపోని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఓయో హోటల్లో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం.
ఒంగోలుకు చెందిన గణేశ్ శంషాబాద్‌లోని సీతా గ్రాండ్ ఓయో హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆ హోటల్ గదుల్లోని బల్బుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా రూమ్ అద్దెకు తీసుకుంటే.. వారి అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు. అనంతరం వారికి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా ఓ జంటను కూడా గణేశ్ అలాగే వేధించాడు.
గణేశ్ వేధింపులు భరించలేని జంట తాజాగా పోలీసులను ఆశ్రయించారు. దీంతో హోటల్‌కు వెళ్లి తనిఖీ చేసిన పోలీసులు.. గదుల్లోని బల్బుల్లో పెట్టిన సీక్రెట్ కెమెరాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడి నుంచి రెండు ఫోన్లను కూడా సీజ్ చేశారు.