e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ ఎర్రగడ్డలో మరో ధర్మాసుపత్రి

ఎర్రగడ్డలో మరో ధర్మాసుపత్రి

ఎర్రగడ్డలో మరో ధర్మాసుపత్రి
  • చెస్ట్‌ దవాఖాన ఆవరణలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌
  • నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయ అంగీకారం
  • వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌
  • ‘గాంధీ’ తరహాలో పకడ్బందీగా నిర్మించే యోచన
  • ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లపై ఒత్తిడి తగ్గించే లక్ష్యం
  • కార్పొరేట్‌కు మించి వైద్య సేవలు అందించే ప్రణాళిక
  • ఆస్పత్రి నిర్మాణంతోపాటు పరిశోధన కేంద్రం ఏర్పాటు

నానాటికి వైద్యం ఖరీదైపోతున్నా నిరుపేదలు, మధ్యతరగతి వారికి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యమందుతున్నది. నగరంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌.. మూడు ప్రధాన ధర్మాస్పత్రుల్లో వైద్య సేవలు అందుతుండగా, ఎర్రగడ్డ ఛాతి (చెస్ట్‌) దవాఖాన ప్రాంగణంలో సకల వసతులతో కార్పొరేట్‌ను మించి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనికి సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు.

ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి ? ఎన్ని అంతస్థులు ? వసతులు తదితర ప్రక్రియలను వేగవంతం చేసేందుకు త్వరలో సర్వే చేపట్టనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఛాతి ఆస్పత్రిని సందర్శించిన తర్వాత సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి తలసాని వివరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఛాతి దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌తో చర్చించారు. నూతన దవాఖాన అందుబాటులోకి వస్తే మెదక్‌, సంగారెడ్డి జిల్లాలతోపాటు గ్రేటర్‌ వ్యాప్తంగా ప్రజలకు మేలు జరగనుంది. దీనికితోడు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లపై చాలావరకు ఒత్తిడి తగ్గనుంది.

అందుబాటులో44 ఎకరాలు

ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి విస్తీర్ణం దాదాపు 62 ఎకరాలు. ప్రస్తుతం 18 ఎకరాల్లో నిర్మాణాలు ఉన్నాయి. మిగతా 44 ఎకరాల భూమి నిర్మాణానికి అందుబాటులో ఉంది. పైగా కూకట్‌పల్లి ప్రధాన మార్గంలో ఉండడంతో రవాణాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతోపాటు అత్యాధునిక వైద్య పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేంద్రం ఏర్పాటైతే కొత్తగా ప్రబలే పలు రకాల వ్యాధులను గుర్తించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినపుడు రోగ నిర్ధారణ పరీక్షలకు ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్‌ 8 (నమస్తే తెలంగాణ): గాంధీ ఉస్మానియా, నిమ్స్‌, తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు క్యూ కట్టే పెద్దాసుపత్రులు ఇవి. సాధారణ రోజుల్లోనే విపరీతమైన రద్దీతో ఉండే ఈ పెద్దాసుపత్రులు కరోనా సమయంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిరుపేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలను అందించే ఈ వైద్యాలయాలపై భారాన్ని తగ్గించడంతో పాటు మరింత మందికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్య సేవల్ని అందించేందుకు నగరంలో మరో పెద్దాసుపత్రి అందుబాటులోకి రానుంది.

ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి ఆవరణలోనే ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ ఇటీవల ఛాతి దవాఖానలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగుల్ని పరామర్శించారు. అక్కడి పరిసరాలను పరిశీలించిన మంత్రి తలసాని, మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. దీంతో సీఎం సూత్రప్రాయంగా అంగీకా రం తెలపడంతో సర్వే, తదితర ప్రక్రియలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌, సంబంధిత అధికారులతో కలిసి ఛాతి ఆస్పత్రిని సందర్శించాక సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.

నిర్మాణ దిశగా అడుగులు..

నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతి ఆస్పత్రి ఆవరణ లో ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆవరణ విస్తీర్ణం, నిర్మాణాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం, తదితర అంశాలపై మం గళవారం దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌తో మంత్రి తలసాని చర్చించారు. ఈ దవాఖానా లో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణం పూర్తయితే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల ప్రజలకు అతి చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని మంత్రి తలసాని అన్నారు.

పేదలకు సైతం కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనేది సీఎం లక్ష్యమని మంత్రి చె ప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యే క చర్యలను తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి నూతనంగా ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న ఎర్రగడ్డలోని చెస్ట్‌ హాస్పిటల్‌ ఆవరణలో కూ డా గాంధీ తరహాలో ఒక మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి తలసాని తెలిపారు.

పరిశోధన కేంద్రానికీ అవకాశం..

సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 18 ఎకరాలలో చెస్ట్‌ దవాఖాన నిర్మాణాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో దాదాపు 44 ఎకరాల భూమి పెద్ద దవాఖాన నిర్మాణానికి అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపా రు. ఇందులో అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడి న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తే పేదలకు అనేక రకాల వైద్య సేవలందించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా వంటి హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గుతుందని స్పష్టం చేశారు. కొత్తగా ప్రబలే పలు రకాల వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక వైద్య పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని మంత్రి తలసాని తెలిపారు. మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రోగ నిర్థారణ పరీక్షలకు ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సిన అసవరం ఉందన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎర్రగడ్డలో మరో ధర్మాసుపత్రి

ట్రెండింగ్‌

Advertisement