అంతులేని విషాదం
ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్‌నగర్‌లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు స్వర్ణగిరి ఆలయాన్ని దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రం కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఓఆర్ఆర్ మీదుగా సనత్‌నగర్‌కు వెళ్తున్నారు.
- దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యుఒడిలోకి
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
- ఆరుగురు మృత్యువాత.. ఒకరికి తీవ్ర గాయాలు
- ఇష్టారాజ్యంగా నిలుపుతున్న వాహనాలు
- చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం
సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, మే 1 (నమస్తే తెలంగాణ) : ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్‌నగర్‌లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు స్వర్ణగిరి ఆలయాన్ని దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రం కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఓఆర్ఆర్ మీదుగా సనత్‌నగర్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట నుంచి నూకల లోడ్‌తో నంద్యాలకు వెళ్తున్న లారీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16కు సమీపంలో ఆగి ఉన్నది. ఈ క్రమంలో వీరి కారు వెనుక నుంచి ఆగి ఉన్న ఆ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ఏడుగురిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు బొల్లి శివకుమార్(37), ఆయన భార్య రాజశ్వేరి అలియాస్ లాస్య(35), బొల్లి రిషిత(7), కోడం శ్రీనివాస్(40), కోడం కృష్ణ చంద్ర(13), కోడం మాధవ్(10)గా గుర్తించారు. కోడం శ్వేతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
ఈ ఘెర ప్రమాదం కేవలం కారు డ్రైవర్ అలసిపోవడం, వేగం, నిద్రమత్తు వంటి కారణాలే కాదని.. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయిలో భద్రతా ప్రమాణాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజలు చెబుతున్నారు. అత్యంత వేగంతో ప్రయాణించే ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపకూడదనే కఠిన నిబంధనలున్నప్పటికీ, లారీ డ్రైవర్లు, ఇతర భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కన వాహనాలను నిలిపేస్తున్నారు.
ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టి ఓఆర్ఆర్పై ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. కాగా, రోడ్డు ప్రమాదం జరిగిన్నట్లు సమాచారం తెలుసుకున్న శ్వేత బంధువులు కొందరు శంషాబాద్‌కు చేరుకున్నారు. శ్వేతకు ఏమైందంటూ.. కన్నీరు మున్నీరయ్యారు. రంగారెడ్డి డీఎంహెచ్‌వో శంషాబాద్ పట్టణంలో చికిత్స పొందుతున్న శ్వేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దవాఖానాకు చేరుకొని అక్కడి వైద్యులతో మాట్లాడి శ్వేతకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
శ్వేతకు మెరుగైన చికిత్స: కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి
రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్‌కు చురుకున్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహేందర్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న శ్వేత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, వెంటనే కిమ్స్ దవాఖానకు తరలించాలని కోరడంతో ఆమెను అక్కడికి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

