Jubleehills | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఈ నెల 10, 11, 14వ తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలున్న కార్యాలయాలు, సంస్థలకు పెయిడ్ హాలిడే ప్రకటించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న యూసుఫ్‌గూడలోని కేవీఆర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరుగుతుంది.