సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సమీప గ్రామాలకు మెరుగైన రోడ్డు నెట్ వర్క్ ఉండేలా చర్యలు చేపట్టింది. శంషాబాద్-రాజేంద్రనగర్ మధ్య ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు కొత్వాల్‌గూడ వరకు రూ.2.97 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు రూపొదించింది. ఓఆర్ఆర్ సర్వీసురోడ్డులోని చెన్నమ్మ హోటల్స్ నుంచి కొత్వాల్‌గూడ వై.ఆర్.రెడ్డి హౌస్ వరకు లింకు రోడ్డు నిర్మాణం ద్వారా ఆ ప్రాంత వాసులకు మెరుగైన రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నారు.