HMDA | సిటీబ్యూరో: హెచ్ఎండీఏ కార్యకలాపాలపై కమిషనర్ దాన కిశోర్ శనివారం సమీక్ష చేశారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి విభాగం పనితీరును ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా అత్యంత కీలకమైన ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపై ఉన్నతాధికారులతో వేర్వేరుగా మాట్లాడారు. ప్లానింగ్ విభాగం డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్ భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతుల వివరాలను, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించారు.