సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో రెండురోజుల పాటు జరిగిన రాక్బేనేచర్ క్యాంప్ విద్యార్థినీ విద్యార్థులకు మధురానుభూతిని మిగిల్చింది. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన క్యాంప్ శనివారం సాయంత్రం వరకు జరిగింది. డెక్కన్ ఉడ్ అండ్ ట్రైల్స్ పేరిట జరిగిన ఈ క్యాంప్‌లో మంచిర్యాల జిల్లా నస్పూర్ రేడియంట్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఎకోటూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ మాట్లాడుతూ ప్రకృతితో మమేకమయ్యేలా విద్యార్థులకు ప్రకృతి ప్రాధాన్యాన్ని తెలిపేలా ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాక్బే నేచర్ క్యాంప్‌లో ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ, ఎఫ్ఆర్ఓ లక్ష్మారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, హెడ్ నేచురలిస్ట్ అఖిల్, అపరంజిని, వండరింగ్ బి హాలీడేస్ తరపున రాఘవేంద్రప్రసాద్, సతీశ్, వంశీ, బాబు తదితరులు పాల్గొన్నారు.