సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలపై హై రేస్ కెమెరాలను బిగించి ఈగల్ వ్యూ సేకరిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
గతేడాది వరకు నగరంలో వాహనాల సగటు వేగం 17 నుంచి 18 కిలోమీటర్లు ఉండేదని, ప్రస్తుతం అది 24 నుంచి 25 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు.హైదరాబాద్లో ప్రస్తుతం 80 శాతం సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతోందన్నారు.