ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం స్వాగతించదగిన పరిణామం. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు వ్యక్తం చేసిన అసంతృప్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
బాగ్‌అంబర్‌పేటలో భూమి విషయంలోను హైకోర్టు తీర్పును ధిక్కరించిన హైడ్రా ఆ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. అక్కడ కూడా వారు మళ్లీ హైకోర్టుకే నిర్ణయాధికారం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తి హక్కులు, రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాలి. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే అమలుచేయాలి. న్యాయ స్థానాల తీర్పులను గౌరవించడం ప్రభుత్వానికి, ప్రతి అధికారికి రాజ్యాంగబద్ధ బాధ్యత.