హైదరాబాద్,జూలై 16 (నమస్తే తెలంగాణ) : కారుణ్య నియమకానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు హైకోర్టులో చుకెదురైంది. కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది. తల్లి చనిపోవడంతో కారుణ్య నియామకానికి సంబంధించి హైదరాబాద్కు చెందిన కుమార్తె పి.కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు పిటిషనర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కారుణ్య నియామకంపై నిర్ణయం తీసుకోవాలంటూ 2025 లో తీర్పు వెలువరించింది.
దీన్ని పునః సమీక్షించాలంటూ జలమండలి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా గతంలో చెప్పిన కారణాలతోనే నియామాకాన్ని తిరసరించడంపై కవిత కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధంగా జలమండలి రివ్యూ పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టారు. రికార్డులో స్పష్టమైన తప్పు ఉన్నపుడే రివ్యూ వేయాలని, అంతేగానీ రివ్యూ అప్పీలుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. రివ్యూ చేయడానికి ఎలాంటి అంశాలు లేనందున జలమండలి రివ్యూ పిటిషన్ ను కొట్టివేశారు. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి కారుణ్య నియామకానికి సంబంధించి 4 వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలంటూ కోర్టు ధికరణ పిటిషన్పై విచారణను మూసివేశారు.