హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : కల్తీ మసాలాల తయారీకి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వికాస్ అగర్వాల్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు దర్యాప్తును నిలిపివేస్తూ పిటిషనర్లకు తక్షణ ఉపశమనం కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు నిరాకరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆహార కల్తీకి సంబంధించి కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు లేదని, సోదాలు నిర్వహించిన సమయంలో పిటిషనర్ అకడ లేరని తెలిపారు.
పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు న మోదు చేసినందున దాన్ని కొట్టివేయాలని కో రారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వా దిస్తూ.. ఆహార కల్తీని అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు, దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. మసాలా దినుసుల్లో ఇతర పదార్థాలను కలిపి ముఠాలుగా ఏర్పడి తయారు చేస్తున్న కల్తీ ఆహార పదార్థాలను ప్రజలు వినియోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.