మాదాపూర్, మే 3: వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ను పురస్కరించుకొని బుధవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై బిజ్ టీవి మీడియా అవార్డ్స్ 2023 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మహమూద్ అలీ, చెవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహరెడ్డి, భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, క్రెడాయ్ రాజశేఖర్‌రెడ్డి, పౌల్ట్రీ ఇండియా చక్రధర్రావులు హజరై హై బిజ్ టీవి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం హై బిజ్ టీవి మీడియా అవార్డులలో భాగంగా బెస్ట్ ప్రింట్ జర్నలిస్టుగా నమస్తే తెలంగాణ సిటీ బ్యూరో చీఫ్ గుండాల కృష్ణ, అడ్వైర్టెజ్‌మెంట్ జనరల్ మేనేజర్ సురేందర్‌రావు, బెస్ట్ కార్టునిస్ట్గా మృత్యుంజయ, బెస్ట్ ఈవెంట్స్ విభాగంలో ఏజీఎం రాజిరెడ్డి, అడ్వైర్టెజ్‌మెంట్ విభాగంలో పి.రాములు, బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా గోపీ బందిగె, బెస్ట్ ఇన్నోవేటివ్ విభాగంలో తెలంగాణ టుడే మేనేజర్ చరణ్ ఆనంద్‌తో పాటు హేమబిందురెడ్డికి మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు.