ఖైరతాబాద్/బంజారాహిల్స్: నాలుగేండ్ల నిండిన చిన్నారులకు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరింపచేయాలని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ సూచించారు. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం చౌరస్తాలో చిన్నారుల రహదారి భద్రతా దినోత్సవం’ సందర్భంగా అవగాహన సభ ఏర్పాటు చేశారు.
డీసీపీ అవినాశ్ మాట్లాడుతూ తల్లిదండ్రులతో పాటు తమతో ప్రయాణిస్తున్న చిన్నారికి సైతం హెల్మెట్‌ను ధరింపచేయడం వల్ల వారి ప్రాణాలకు, బంగారు భవితకు రక్షణ కల్పించిన వారమవుతామన్నారు. అలాగే బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ జంక్షన వద్ద ట్రాఫిక్ పోలీసులు చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి, జూబ్లీహిల్స్ జోన్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ సైది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.