హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఊర్లకు వెళ్లేందుకు బస్టాప్‌ల వద్ద ప్రజలు బస్సుల కోసం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది.
కాగా, రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెకొంది. హైరదాబాద్‌లోని ప్రధాని బస్టాండ్లలో రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, సికింద్రాబాద్ జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్లో బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా రాఖీ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నది. ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.