శంషాబాద్ రూరల్, మే 14: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు జీఎఫ్ 274(గల్ఫ్ ఎయిర్లైన్స్) విమానంలో రియాద్ నుంచి బ్రహెయిన్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా 24 క్యారేట్ల 14 బంగారు కడ్డీలను లభించాయి. దీని విలువ సుమారు రూ.67,96,133 ఉంటుందని అధికారులు అంచానా వేశారు. ప్రయాణికుడిని ఆదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.