హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. నగర వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వాసులు ఇండ్లకే పరిమితం కావాలని సూచించింది. రాబోయే 3 గంటల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షం జూలై నెలలో అతిపెద్ద వర్షంగా భావించొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కార్యాలయాలు, వ్యాపార సముదాయాల నుంచి తమ నివాసాలకు వెళ్లే వారు.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే వాహనదారులు రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం ఆగిన గంట తర్వాత రహదారులపైకి రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సుచిత్ర, చింతల్, కొంపల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, రసూల్‌పురా, తిరుమలగిరి, బొల్లారం, కుషాయిగూడ, చిలకలగూడ, బేగంపేట్, కాప్రా ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. పలు కాలనీల్లోకి వరద నీరు నివాసాల్లోకి చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది.
Today’s rainfall event will be a big highlight of this July month for Hyderabad. We are in for a big spell in next 2-3hrs and 100+mm rains on cards 🙏#HyderabadRains
— Telangana Weatherman (@balaji25_t) July 22, 2022