హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మీర్‌పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు, మూడు రోజుల నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిన విషయం తెలిసిందే.