హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎండ దంచికొట్టింది. దీంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కానీ రాత్రి సమయానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో.. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, మణికొండ, ఖాజాగూడ, షేక్‌పేట, టోలిచౌకీ, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట్, అమీర్‌పేట, సనత్ నగర్, బాలానగర్, రాజేంద్ర నగర్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, గండిపేట్, పుప్పాలగూడ, అత్తాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.