Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. యూసుఫ్‌గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. యూసుఫ్‌గూడలో 51.3 మి.మీ., ఖైరతాబాద్‌లో 48.0, కుత్బుల్లాపూర్‌లోని ఆదర్శ నగర్లో 44.3, ఖైరతాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో 42.8, బాలానగర్‌లో 42.5, షేక్‌పేటలో 42.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
బంజారాహిల్స్‌లోని రోడ్ నం. 9లో వరద ఉధృతికి నాలా పైకప్పు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై వరద నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, బేగంపేట వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ కూడా అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, నేలకొరిగిన వృక్షాలను తొలగించాలని ఆదేశించారు. రాత్రి 7 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించొచ్చు అని తెలిపారు.
Heavy rainfall is expected today in Hyderabad city. Citizens may plan their travel accordingly. Citizens may dial 040-21111111 or 9000113667 for GHMC-DRF assistance.@gadwalvijayainc @TSMAUDOnline @CommissionrGHMC @GHMCOnline pic.twitter.com/OyEBTj5PIc
— Director EV&DM, GHMC (@Director_EVDM) May 16, 2024
The DRF teams are clearing water stagnation in various places in the city. Citizens may dial 040-21111111 or 9000113667 for GHMC-DRF assistance.@gadwalvijayainc @TSMAUDOnline @CommissionrGHMC @GHMCOnline pic.twitter.com/3Rt07rRxKI
— DRF@EVDM (@DRFEVDM) May 16, 2024