Heavy Rains | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
Heavy Rains | హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. గురువారం మాదిరి వాన దంచికొడుతుంది.
Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. గురువారం మాదిరి వాన దంచికొడుతుంది. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. శనివారం రాత్రి మాత్రం ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్లో వర్షం కురిసింది. హిమాయత్‌నగర్, నారాయణగూడ, రాజేంద్రనగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాక్త్పు, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, జియగూడ, చైతన్యపురి, దిల్షుక్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, బోడుప్పల్, మేడిపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఖైతరాబాద్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, షేక్‌పేట్, టోలిచౌకీ, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, తార్నాక, ఓయూ, లాలాపేట, ఎర్రగడ్డ, సనత్‌నగర్, మియాపూర్, గచ్చిబౌలి, మదాపూర్, లక్డీకాపుల్, మాసాబ్‌ట్యాంక్, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, చంపాపేట్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
ఇక శనివారం సాయంత్రం హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, నాదర్గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ – విజయవాడ హైవేపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. పెద్ద అంబర్పేట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి వెళ్లే రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. భాగ్యలత వద్ద నీటి నిల్వతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. పెద్ద అంబర్పేట్ నుంచి ఎల్బీనగర్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లా తొర్రూరులో అత్యధికంగా 116.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, నాదర్గుల్లో 80 మి.మీ., హయత్‌నగర్‌లో 75 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం సికింద్రాబాద్, తార్నాక, రామాంతపూర్, అంబర్‌ఫేట్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, నారాయణగూడ, రాజేంద్రనగర్, గోల్కొండ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సైదాబాద్‌లోని రెడ్డి కాలనీ నీట మునిగింది. వరద నీటిలో బయటకు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

