Rains | హైదరాబాద్ : మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6.30 గంటల నుంచి ఓ అర గంట పాటు వర్షం కురిసింది.
ముషీరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అంబర్పేట్, మలక్‌పేట్, చార్మినార్, కాప్రా, మల్కాజ్గిరి, హిమాయత్‌నగర్, అల్వాల్, ఖైరతాబాద్, లింగంపల్లి, పటాన్చెరు, అమీర్‌పేట, కుత్బుల్లాపూర్‌తో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 46.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పల్, అంబర్‌పేట, చార్మినార్, కాప్రాలో 40 నుంచి 45 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.