Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా.. హఠాత్తుగా వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఉప్పుగూడ, బహదూర్పురా, ఛత్రినాక పరిసరాల్లో వర్షం కురుస్తున్నది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫానుగా మారిందని.. వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) ప్రకటించింది. రేపటికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అందని అంచనా వేసింది. మోఖా తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.