Heavy Rains | సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): రుతుపవన ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు, మూడు రోజులు గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన మేరకు ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. నగరంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.4డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.