Hyd Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. బీఎన్‌రెడ్డినగర్, నానక్రామ్గూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై భారీగా భారీగా నిలువడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
అయితే, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఓయూ, ఎల్బీనగర్తో పాటు సహా ఉత్తర, పశ్చిమ, సెంట్రల్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు జనగాం, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో రాబోయే రెండుగంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.