Hyd Rain | హైదరాబాద్‌లో సోమవారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్‌గూడలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, కార్వాన్, గోల్కండ, ఖైరతాబాద్, లక్డీకపూరల్, మాదాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, వివేకానందనగర్, హిమాయత్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, కాప్రా, జియాగూడ పరిసర ప్రాంతాల్లో వానపడింది. ఫిలింనగర్, ఎల్బీనగర్, వనస్థలీపురం, నాగోల్, మల్కాజ్గిరి, జవహర్‌నగర్, కాప్రాలో భారీ వర్షం కురిసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. కోన్ని చోట్ల వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ ప్రజలను సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పింది. వర్షాలతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రత్తమైంది.