హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి ఓ గంట పాటు వాన దంచికొట్టింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఉప్పల్‌లోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ ఏరియాలో అత్యధికంగా 31.8 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కాప్రాలో 24.8, సఫిల్‌గూడలో 23, కూకట్‌పల్లిలో 21, తిరుమలగిరిలో 20.8, మోతీనగర్‌లో 20.5, యూసుఫ్‌గూడలో 20.3, బాలాజీనగర్‌లో 19.8, రంగారెడ్డి నగర్లో 19.5, షేక్‌పేటలో 19.3, మల్కాజ్‌గిరిలో 17.8, ఖైరతాబాద్‌లో 17.5, వెస్ట్ మారేడ్‌పల్లిలో 16.8, షాపూర్‌నగర్‌లో 14.0, మాదాపూర్‌లో 12.3, జగద్గిరిగుట్టలో 12.3, మల్లాపూర్ బయోడైవర్సిటీ ఏరియాలో 12.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.