Hyderabad | హైదరాబాద్‌ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. గంట నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. శనివారం రాత్రి సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, ఆబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తున్నది. లక్డీకపూల్నుంచి చార్మినార్ వరకు ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్వాల్, యాప్రాల్, జవహర్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ వాన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.