సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రాత్రి 9గంటల వరకు నగరంలోని ఉప్పల్లో అత్యధికంగా 2.63సెం. మీలు, బహుదూర్పురాలో 1.15సెం.మీలు, హబ్సిగూడలో 5మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారి వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.