సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటలవరకు నగరంలోని షేక్‌పేట్ ప్రాంతంలో 3.58సెం.మీ, లంగర్‌హౌస్ 2.38సెం.మీ, గచ్చిబౌలి 1.70సెం.మీ, మెహదీపట్నం 1.43సెం.మీ, అత్తాపూర్ 1.43సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంపై రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.1డిగ్రీలు, గాలిలో తేమ 84శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.