Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. దాంతో, నీటిని దిగువకు విడుదల చేయాలనుకుంటున్న అధికారులు మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సహాయం కోసం 040 2111 1111 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. నగరంలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్ 11.3 సెం.మీ వాన నమోదైంది.
వాన దంచికొట్టడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల మీదకు పెద్ద మొత్తంలో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియాల వారీగా ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడిందంటే..? గచ్చిబౌలి, శేరీ లింగంపల్లిలో 12.3 సెం.మీ, ఉప్పల్ 9 .5 సెం.మీ, గోల్కోండ 9.5 సెం.మీ, బంజారాహిల్స్ 9 సెం.మీ, బాలానగర్ 7 సెం.మీ. జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ, నేరెడ్మెట్ 6.5 సెం.మీ.