హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, లక్డీకపూల్, నాంపల్లి, అడిబ్స్, కోఠి, యూసుఫ్‌గూడ, పటాన్‌చెరూ, మియాపూర్, కూకట్పల్లి, మూసాపేట్, భరత్‌నగర్, బాలానగర్, బోయిన్పల్లి, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, నాచారం, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, కుషాయిగూడ, చంగిచర్ల, నారపల్లి, నాగోల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, హస్తినాపురంలో వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అకడకకడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కుమ్రంభీం, మహబూబాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కుమ్రంభీం జిల్లా తిర్యాలలో 5.65 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 5.47, జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 4.95, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.26, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 4.58, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 4.02, యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్-ఎంలో 3.85, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో 3.67, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 3.62, సిద్దిపేట జిల్లా నంగనూర్లో 3.42 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
Heavy downpours started in Hyderabad at 4AM and still continuing in many parts. However rains will gradually reduce after 8AM, so stay alert till 8AM thereafter only light rains ahead 🌧️👍 https://t.co/lE8f0ofVt4
— Telangana Weatherman (@balaji25_t) August 12, 2024
It’s 6AM and raining in Hyderabad city as expected in yesterday post 😍🌧️🌧️ https://t.co/lE8f0ofVt4 pic.twitter.com/9Jirgvgwv2
— Telangana Weatherman (@balaji25_t) August 12, 2024