Heart Attack | అమీర్‌పేట, ఫిబ్రవరి 17 : డయాగ్నోసిస్ సరిగ్గా ఉంటే గుండెపోటు నివారణ సాధ్యమేనని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. గుండె పనితీరును కనిపెట్టే ఒక సాధారణ ఈసీజీని నిపుణుడైన వైద్యుడు సరిగ్గా విశ్లేషించగలిగితే, అందులో అనేక రకాల సమస్యల గురించి తెలుస్తుందని అన్నారు. గుండెలో ఉండే పలు రకాల మార్పులను ఈసీజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.
అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో బేసిక్ అండ్ బియాండ్ ఈసీజీ పేరుతో 160 మంది యువ వైద్యులకు సోమవారం నాడు ఒక అవగాహన సదస్సును నిర్వహించారు. గుండెలో ఉండే ఎలక్ట్రోలైట్ మార్పులు, గుండె వేగం ఉన్నట్టుండి బాగా పెరిగిపోవడం, వివిధ కేసుల్లో ఈసీజీని బట్టి వీటన్నింటినీ ఎలా గుర్తించగలమనే విషయాలను ఈ సదస్సులో డాక్టర్ సాయి రవిశంకర్ వివరించారు. అనంతరం యువ వైద్యులకు ఈసీజీ గురించిన ప్రాథమిక విషయాలతో కూడిన ఒక క్విజ్ పోటీ నిర్వహించారు.
అవగాహన సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న వైద్య నిపుణులు
ఈ సదస్సులో పాల్గొన్న పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఒక ఈసీజీని సరిగా విశ్లేషించగలిగితే అందులో అనేక రకాల సమస్యల గురించి తెలుస్తుందని అన్నారు. గుండెలో చోటు చేసుకునే పలు రకాల మార్పులను ఈసీజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. గుండెలో ఉండే ఎలక్ట్రోలైట్ మార్పులు, గుండె వేగంగా ఉన్నట్టుండి బాగా పెరిగిపోవడం వంటి అంశాలను ఈసీజీ ని బట్టి వీటన్నింటిని ఎలా గుర్తించగలం అన్న విషయాలను సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో యశోద ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.రఘు, కిమ్స్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ఎలక్ట్రో ఫిజియోలజిస్ట్ డాక్టర్ బి. హయగ్రీవ రావులతో లతోపాటు పలువురు గుండె వైద్య నిపుణులు డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ గురు ప్రసాద్, డాక్టర్ వైస్ శివకుమార్, డాక్టర్ ఎంవీఎస్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.