సిటీబ్యూరో, జూన్ 2, (నమస్తే తెలంగాణ): క్షయ రహిత సమాజమే ధ్యేయమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ను సోమవారం హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్లో ఉన్న హమాలీ బాథి టీబీ యూనిట్లో ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో టీబీ నిర్మూలన దిశగా మేం వేగంగా పనిచేస్తున్నాం… అతి తక్కువ సమయంలో లక్షణాలను గుర్తించి, సరైన చికిత్స అం దించింది ప్రాణాలు కాపాడుతున్నాం.. రెండు వా రాల కన్నా ఎక్కువ దగ్గు, ఛాతిలో నొప్పి, రక్తంతో దగ్గు, బరువు తగ్గడం, రాత్రి చెమటలు, ఆకలి తగ్గడం, శ్వాసలో ఇబ్బంది, మెడలో ఉబ్బిన గ్రం థులు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సల హా తీసుకోవాలి.. అధునాతన పరీక్షలు , నిక్-క్షయ్ మిత్రా కార్యక్రమం ద్వారా పోషకాహార మద్దతు, డోర్ టు డోర్ స్క్రీనింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా టీబీ బాధితులకు నెలకు రూ.1000 అందించనున్నారు.. నిక్-క్షయ్ పోర్ట ల్ ద్వారా రోగుల చికిత్సను నిత్యం పర్యవేక్షించనున్నారు… ప్రజలు నిక్-క్షయ్ మిత్రలుగా చేరి టీబీ నిర్మూలనలో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. చలాదేవి, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డా.శ్రీకాంత్, డా.సాయిబాబు, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డా. మహేశ్, టీబీ మెడికల్ ఆఫీసర్ డా. సరిత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.