హయత్నగర్, ఫిబ్రవరి 8: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఆలయ కమిటీ ఆహ్వానం అందజేసింది. ఈ నెల 14 నుంచి 16 వనరే శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరుగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు ఆవుల నరేందర్, సందీప్ కుమార్, రాము యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ ఎర్ర రవీందర్, గౌరవ అధ్యక్షుడు పారంద స్వామి, ఉపాధ్యక్షులు ముత్యం శ్రీకాంత్, కోశాధికారి పిట్టల జంగం, ఉప కోశాధికారి క్యాదాస్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.